Parupalli Subbarao’s biography, net worth, fact, career, awards and life story

Intro Indian stage and film artist
Is Actor 
From India 
Type Film, TV, Stage & Radio 
Gender male
Birth 1897

పారుపల్లి సుబ్బారావు ప్రముఖ నాటక, సినీ రంగ కళాకారుడు. స్త్రీ పాత్రలకు ప్రసిద్ధి పొందిన వాడు. సంగీత విద్యాంసుడు కూడా. కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో 1897లో జన్మించారు.

నట ప్రస్థానం

1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించాడు. సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి. పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం ఈయన నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.

నటించిన పాత్రలు

  • విమల (రసపుత్ర విజయం)
  • రాముడు (లవకుశ)
  • సావిత్రి
  • లీలావతి
  • రాధ
  • సుకన్య
  • కైక
  • చంద్రమతి
  • రుక్మిణి
  • రత్నాంగి
  • కమలాంబ
  • దుర్యోధనుడు
  • రామదాసు

మూలాలు

  • పారుపల్లి సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.
You May Also Like

Boutross

Learn about Boutross Biography, Age, Lyrics, Songs, Girlfriend, Instagram, Net Worth & 10 Facts. Boutross Mwebia Munene is a rapper,producer and singer who resides in Nairobi, Kenya.
Read More